



🙏 About Pujya Bhikshamaiah Guruji
Born on 1st May 1953 in Guntur District, Andhra Pradesh, Pujya Guruji began his journey as a dedicated academic, earning a Master’s Degree in Zoology from Andhra University and serving as a Head of the Department in Zoology for over two decades.
In 1991, divine inspiration led him into the spiritual path. Trained as a Guru in 1993, he established Sri Satya Sai Dhyanamandali Charitable Trust in 1998 at Vijayawada, Andhra Pradesh. His mission: to awaken consciousness through yoga, meditation, and spiritual education.
Guruji is revered not only as a teacher and spiritual scientist but also as a singer and composer, having released more than 60 devotional CDs and 300 songs filled with bhakti and love.
🧘♂️ Courses Offered
🕉️ Dhyana Vidya Yoga Training (10 Days)
A foundational course to awaken inner peace and concentration.
🌺 Nitya Samadhi Yoga (4 Days Residential)
A deep meditative practice leading to continuous awareness.
🔆 Sankalpa Siddha Yoga (5 Days Residential)
Transforms thoughts into divine realizations through intense practice.
🕊️ Sahajananda Yoga (5 Days Residential)
Teaches effortless meditation — the art of being naturally blissful.
💫 Satya Darsanam – Atma Stiti (6 Days Residential)
Revealing the truth of the self beyond body and mind.
📖 Jeevana Vedam (7 Days Residential)
Understanding the divine principles that guide a fulfilled life.
🧑🏫 Teacher Training (Three Phases – 30 Days)
Comprehensive instructor program for dedicated seekers.
🌱 Children & Students Personality Development
Holistic programs for young minds — cultivating discipline, focus, and values.
🎯 Vision & Mission
Vision: To create a global family of spiritually awakened individuals dedicated to spreading truth, love, and selfless service.
Mission: To promote universal peace, spiritual awakening, and holistic living through the practice of yoga, meditation, and service.
గురూజీ పరిచయం
సత్యసేవక్ ప్రేమారవింద పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుజిల్లా (విభజన అనంతరం పల్నాడుజిల్లా)లో 1951వ సంవత్సరంలో. ఒకసామాన్య పేదరైతు కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులకు పదకొండవ, చివరిసంతానం కావడం వలన, వారు శారీరకంగా, మానసికంగా బలహీనపడిన తరుణంలో జన్మనివ్వడం వలన అతిభయంకర, వంశపారంపర్య దీర్ఘకాలిక రుగ్మతలకు లోనుకావడం జరిగింది. రక్తహీనత, ఊపిరితిత్తుల అంటువ్యాధి, మలబద్ధకం, సోరియా సిస్ అనబడే మొండి చర్మ వ్యాధితో పాటు, శరీరంలో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన శరీరం తరచుగా అంటువ్యాధులకు గురైంది.
అయితే విద్యలో అద్భుతంగా రాణించి హైస్కూల్ స్థాయినుండి మాస్టర్ డిగ్రీవరకు ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణులై, 1976 నుండి 80 వరకు చిలకలూరిపేటలోని జూనియర్ కళాశాలలో జంతుశాస్త్రంలో జూనియర్ లెక్చరర్ గా, 1980 నుండి 1999 వరకు డిగ్రీకళాశాలలో జంతుశాస్త్ర విభాగపు అధిపతిగా ఉద్యోగబాధ్యతలను నిర్వహించడం జరిగింది.
ఆవిధంగా ఆర్ధికపరమైన ఒత్తిడి నుండి బయటపడినప్పటికీ, వంశపారంపర్య దీర్ఘకాలిక రుగ్మతలనుండి కూడా కొంతవరకు నివారణ కలిగినప్పటికీ, మూలనిర్మాణం మాత్రం ఇంకా బలహీనంగానే ఉంది. అందువలన అన్నిరకాల రుగ్మతల నుండి సమూలంగా విడుదలై, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది, కుటుంబానికి, వృత్తికి న్యాయంచేయాలనే తపనతో, 1991లో ఆరొగ్యాన్ని పొంది, కుటుంబానికి, వృత్తికి న్యాయంచేయాలనే తపనతో, 1991లో ఆధ్యాత్మికమార్గంలోనికి ప్రవేశించడం జరిగింది. విద్యార్ధి దశనుండి హేతువాద, నాస్తికవాద, వామపక్ష, సైన్సుపరమైన పరిజ్ఞానంతో ఆధ్యాత్మికతను వ్యతిరేకించినప్పటికీ, ఇతరమార్గాలద్వారా ఫలితం లభించనందువలన కేవలం రుగ్మతల నివారణకోసం ఆఖరిఅస్త్రంగా ఈ మార్గాన్ని ఆశ్రయించడం జరిగింది.
అయితే ప్రారంభంలో అశాస్త్రీయవిధానాలను అనుసరించడం వలన, లబ్ది కలగకపోగా కొంతవరకు నష్టం జరిగింది. కానీ ఆధ్యాత్మికమార్గమే అన్నిసమస్యలకు సమూల శాశ్వతపరిష్కారమనే దృఢవిశ్వాసంతో ముందుకు సాగుతూ, 1993లో 2 | గురూజీగా శిక్షణపొంది ఆధ్యాత్మిక ప్రచారంలో ముమ్మరంగా పాల్గొనడం జరిగింది.
గురూజీగా శిక్షణపొంది ఆధ్యాత్మికప్రచారంలో ముమ్మరంగా పాల్గొనడం జరిగింది. ఆ తదుపరి దానిని సమగ్రంగా, సశాస్త్రీయంగా, సరళంగా, సులభంగా ప్రపంచానికి అందించాలనే సత్సంకల్పంతో విజయవాడను ప్రధానకేంద్రంగా చేసుకొని 1998లో ధ్యానమండలి ఛారిటబుల్ ట్రస్ట్‌ను ప్రారంభించడం, ఆ తదుపరి 1999లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తికాలం సంస్థ కార్యక్రమాలకే కేటాయించడం, 2000 సంవత్సరంలో గురువుల గురుకుల శిక్షణ ద్వారా గురువులను తయారుచేయడం, సమగ్ర విశ్వశక్తియోగచికిత్స ద్వారా అన్నిరకాల రుగ్మతలకు మందులను తయారుచేసి ఉచితంగా అందించడం, దశలవారీగా వివిధరకాల శిక్షణాతరగతులను రూపొందించి ప్రచారం చేయడం, పుస్తకాలను రచించడం, ప్రవచనాలను రికార్డు చేయడం, వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించడం వంటి అనేక విధానాల వలన సంస్థ శరవేగంగా విస్తరించింది.
Why Choose Us?
At Sri Satya Sai Dhyanamandali, we don’t just teach yoga — we nurture the soul. Under the divine guidance of Pujya Bhikshamaiah Guruji (Sri Satya Sevak Premaravinda), we bring together spiritual wisdom, yogic science, and compassionate service to transform lives.
Every seeker here is guided with love, discipline, and the light of truth — helping them realize peace, purpose, and self-awareness.
Guided by Pujya Bhikshamaiah Guruji
Experience divine wisdom and inner transformation under the guidance of Sri Satya Sevak Premaravinda (Guruji), Founder of Sri Satya Sai Dhyanamandali.
Spiritual Yoga Courses
Learn unique yogic paths like Dhyana Vidya, Nitya Samadhi, Sahajananda, and Sankalpa Siddha Yoga for peace and self-realization.
Meditation & Self Awareness
Join thousands in guided meditation camps to awaken your consciousness and experience inner silence.
Service to Humanity
Participate in free medical, social, and cultural activities dedicated to spreading compassion and holistic living.
Divine Publications & Music
Explore Guruji’s spiritual works — 75+ books, 150 speeches, 300 bhajans and mantras released across India.
Nationwide Spiritual Centers
Join our 80+ centers across India offering yoga training, residential camps, and free spiritual education for all.
సంస్థ పరిచయం
పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ, 1991వ సంవత్సరంలో ఆధ్యాత్మికమార్గంలోనికి ప్రవేశించి, 1993లో గురూజీగా శిక్షణ పొంది, దానిని అన్నివర్గాల వారికి సరళంగా, సులభంగా, సశాస్త్రీయంగా, ఉచితంగా అందించాలనే సత్సంకల్పంతో, తన ధర్మపత్ని శ్రీమతి సూర్యకుమారి మాతాజీ ప్రోత్సాహంతో, 1998 మార్చి 29 ఉగాది పర్వదినాన, విజయవాడను ప్రధానకేంద్రంగా చేసుకొని, ధ్యానమండలి ఛారిటబుల్ ట్రస్ట్‌ను ప్రారం భించడం జరిగింది.
అప్పటినుండి ఆ దంపతులిరువురు నిర్విరామంగా కృషి చేస్తూ, సంస్థను అంచలంచెలుగా, దశలవారీగా అభివృద్ధిపధంలో కొనసాగించారు. గురూజీ దాదాపు 100 పుస్తకాలను రచించి ప్రచురించడం, 250కు పైగా ప్రవచనాలను రికార్డు చేసి విడుదల గావించడం, వివిధ రకాల శిక్షణా తరగతులను రూపొందించడం, గురువులు గురుకుల శిక్షణల ద్వారా గురూజీలను తయారుచేయడం, అలాగే మాతాజీ ఆధ్వర్యంలో 65కు పైగా భజనలు, భక్తిగీతాలు, మంత్రాలు, శ్లోకాల సీడీలను రికార్డు చేయడం, సమగ్రవిశ్వశక్తి యోగచికిత్స ద్వారా అన్నిరకాల రుగ్మతలకు మందులను తయారుచేసి ఉచితంగా అందించడం వంటి వినూత్న విధానాల ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాలలో బ్రహ్మోపదేశాల ద్వారా మంత్రాన్ని ఉపదేశించి లక్షలాదిమందికి బ్రహ్మ జ్ఞానాన్ని అందించడం జరిగింది.
2007వ సంవత్సరంలో ధ్యానమాలిక మాసపత్రికను ప్రారంభించి దానిని దశలవారీగా విస్తరిస్తూ ప్రస్తుతం 7 వేలమందికి పైగా చందాదారు లకు అందించడం జరుగుతుంది. దాదాపు 2,500 ధార్మికసంస్థలకు, దేవాలయాలకు, వృద్ధాశ్రమాలకు, ఇతర సేవాసంస్థలకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. సంస్థ ఆధ్వర్యంలో అనంతపురంజిల్లా నార్పలలో అనాధలకు, పేదవర్గాల విద్యార్ధినీ విద్యార్ధులకు శ్రీసత్యసాయి యోగ విద్యానిలయం ద్వారా ఉచితంగా విద్యను, భోజనం, వసతిని అందించడం జరుగుతుంది. పుట్టపర్తిలో శ్రీసత్యసాయి సేవాసదన్, రాజమండ్రిలో శ్రీసాయిబృందావనంలతో పాటు, నంద్యాలజిల్లా మహానందిలో గురుకుల శిక్షణల నిర్వహణకు అనువుగా ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
సంస్థను అంతర్జాతీయస్థాయిలో విస్తరింపజేసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను యోగాంధ్ర గా తీర్చిదిద్దాలనే బలమైన దృక్పధంతో, యోగవిశ్వ విద్యాలయం, యోగ పరిశోధనా కేంద్రం, యోగవిద్యాలయాలు, యోగ వైద్యశాలలు, గ్రామీణశిబిరాలు అవసరమనే భావనతో, భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్యసాయిబాబా వారి అండదండల కోసం, ఆశీస్సుల కోసం స్వామీజీ ఆశ్రయించడం జరిగింది. స్వామీజీ ఆదేశం మేరకు 2008లో సంస్థ పేరును శ్రీ సత్యసాయి ధ్యానమండలిగా మార్చడం జరిగింది.
అయితే 2020లలో కోవిడ్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అన్నిదేశాలకు విస్తరించడం వలన, ప్రత్యక్షంగా బ్రహ్మోపదేశాలు నిర్వహించే అవకాశం లేనందువల్ల, అప్పుడప్పుడు గురుకుల శిక్షణలను మాత్రమే నిర్వహించడం జరిగింది. అంతేగాక దురదృష్టవశాత్తూ 2021 ఆగష్టు-30వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన పూజ్య మాతాజీ శివైక్యం చెందడంతో సంస్థ “మనుగడను గురించి అనేక సందేహాలు తలెత్తాయి.
అయితే దాదాపు 10 నెలలు పాటు ఉభయరాష్ట్రాలలో దాదాపు 50 కేంద్రాలలో మాతాజీ దివ్యసంస్మరణ కార్యక్రమా లతోపాటు, ఆధ్యాత్మిక సదస్సులను కూడా నిర్వహించడం వలన సంస్థ పునాదులు పటిష్టంగానే ఉన్నాయని ఋజువైంది. 2024 మే నెలలో “సంకల్ప సిద్ధివ్రతం” అనబడే ప్రత్యేక గురుకుల శిక్షణను వీడియోల ద్వారా గురుశిష్య సంవాదంతో నవీన, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, రూపొందించి అందించడం వలన అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ స్ఫూర్తితో ప్రస్తుతం “అంతర్ముఖయోగం” అనే సాధారణ శిక్షణను వీడియోల ద్వారా రూపొందించి అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ శిక్షణకు హాజరైన వారిని తదుపరి “చిత్తశుద్ధియోగశిక్షణ”, “సత్యదర్శనయోగశిక్షణ”, “సంకల్పసిద్ధి యోగశిక్షణ”, “ఆత్మస్థితియోగశిక్షణ” వంటి గురుకుల శిక్షణలకు అనుమతించడం జరుగుతుంది. ఆత్మస్థితి యోగాన్ని జీవితానికి అన్వయించుకోగలిగితే అవధూతలుగా పరిణతి చెందగలుగుతారు.
భవిష్యత్తులో బాలబాలికలకు, యువతీయువకులకు, విద్యార్ధులకు, మహిళలకు ప్రత్యేకంగా శిక్షణాతరగతులను రూపొందించాలనే ప్రయత్నం జరుగుతుంది. మరొక కీలకాంశమేమిటంటే అన్ని శిక్షణలను ఉచితంగా అందించాలని నిర్ణయించడం జరిగింది. వాస్తవానికి ఉచితం అనే అంశానికి కొందరు విలువనివ్వకపోవచ్చు. అయినాసరే ఆధ్యాత్మికతను అన్నివర్గాలకు అందించాలనే భావనతో, ఈ విధంగా నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే గురు శిష్యుల మధ్య ఆర్థికపరమైన అంశాలకు ఎటువంటి అవకాశం ఉండకూడదు. సంస్థ ఆదర్శ ప్రపంచ నిర్మాణ బాధ్యతను చేపడుతుంది కాబట్టి, ప్రపంచమే సంస్థ నిర్వహణ బాధ్యతను కూడా తప్పక స్వీకరిస్తుంది. అందువలన అంతర్ముఖయోగం అనబడే ఈ ప్రాధమిక శిక్షణను దిగ్విజయంగా పూర్తిగావించుకొని ఆ తదుపరి దశల వారీగా అన్నిశిక్షణలను పూర్తి చేసుకొని మిమ్ములను, మీ కుటుంబాన్ని ఆనందమయం చేసుకుంటారని ఆశిస్తూ… ఆకాంక్షిస్తూ… అభిలషిస్తూ….
శ్రీ సత్యసాయి ధ్యానమండలి
విజయవాడ.
